The South9
The news is by your side.

తమ్ముడు పై ప్రేమ చూపించిన మెగాస్టార్ చిరంజీవి

post top

పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన సినిమా వకీల్ సాబ్ తన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న విడుదలైన వకీల్ సాబ్ సినిమా ని కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి వీక్షించడం జరిగింది. తాను కూడా ఒక అభిమానిగా మారిపోయి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా చూసిన తర్వాత తన అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు చిరంజీవి….. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో అదే వేడి, అదే వాడి, అదే ప‌వర్. ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. అన‌న్య‌, అంజ‌లి, నివేదా థామ‌స్ వాళ్ల వాళ్ల పాత్ర‌ల‌లో జీవించేశారు. థ‌మ‌న్, డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. అన్నింటికి మించి మ‌హిళ‌ల‌కు ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌ర‌మైన చిత్రం వ‌కీల్ సాబ్. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు, అంద‌రి మ‌న‌సులని గెలుస్తాడు. అంటూ క్రియేట్ చేశారు

after image

దిల్ రాజు, బోనీ క‌పూర్, తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియజేశారు చిరంజీవి

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.