తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా బిజెపి పార్టీ నాయుడుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ కి, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తోపాటు పలువురు కేంద్ర మంత్రులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు వస్తున్నట్టు మీడియాకి తెలియజేశారు. అయితే గంట క్రితం జనసేన పార్టీకి సంబంధించిన ఒక లేఖ ను మీడియాకి విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినందున పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్టు గతంలో తనను కలిసిన వాళ్లు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపినట్లు జనసేన వర్గాలు ఆ లేఖలో పొందుపరచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాయుడుపేట సభకి హాజరుకాలేరు అని అన్నారు.
గతంలో కూడా పవన్ కళ్యాణ్ మిగతా ప్రచారానికి పెద్దగా రారని నాదెండ్ల మనోహర్ కి ఆ బాధ్యత అప్ప చెప్పినట్లుగా మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ రావడంతో అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. ఇప్పుడున్న కరోనా సెకండ్ వేవ్ లో ఇటువంటి భారీ బహిరంగ సభలో రాజకీయ పక్షాలు పెట్టకపోవడమే మంచిది. వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థికి మద్దతుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముందుగా భారీ బహిరంగ సభకు వస్తానని చెప్పి కరోనా ఉన్నందువల్ల సభ క్యాన్సల్ చేసుకోవడం గమనార్హం



Comments are closed.