The South9
The news is by your side.

కేంద్ర కొత్త ఎన్నికల సంఘం కమీషనర్ గా సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ : ‌కేంద్ర కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ గా సుశీల్ చంద్ర అ నియమితులు కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ లలో అత్యంత సీనియర్ గా ఉన్నవారిని నియమించడం అనే ప్రక్రియ మొదటి నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో అందరికన్నా సీనియర్ అయిన సుశీల్ చంద్ర పేరును కేంద్రం ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడున్న సి .ఈ. సి సునీల్ అరోరా రేపటితో అనగా ఏప్రిల్ 12న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజునే సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. 2019 ఎన్నికలకు ముందు సుశీల్ చంద్ర  ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.

Post midle

Leave A Reply

Your email address will not be published.