The South9
The news is by your side.

నిద్ర లేని రాత్రులు గడిపిన మెగాస్టార్.

post top

south 9 ప్రతినిధి :

after image

సినిమా డెస్క్ 

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో హీరోగా ఓ విలువ వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. మధ్యలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయారు. రీఎంట్రీలో కూడా కుర్రాళ్లకు గట్టి పోటీ ఇచ్చారాయన. తాజాగా విశ్వంభరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఓ హీరో కారణంగా చిరంజీవి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట. ఈ విషయాన్ని చిరంజీవివే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అత‌ను  ఎవరో కాదు కమల్ హాసన్. కమలహాసన్ నటించిన స్వాతిముత్యం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో కమల్ నటనకు మెగాస్టార్ ఫిదా అయిపోయారట. అసలు అంత బాగా ఎలా నటించారని తనకు తాను ప్రశ్నించుకున్నారట చిరంజీవి. అసలు ఈ సినిమాలో నటించింది కమలహాస‌నేనా అనే సందేహం చిరంజీవిలో కలిగిందట. ఆ సినిమా చూసిన తర్వాత చాలా రోజులు చిరంజీవికి నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా కమలహాసన్ కు చెప్పారు అట. వీరిద్దరూ మీటైనప్పుడు చిరు కమలహాసన్ ను హగ్ చేసుకుని అసలు ఎలా సాధ్యమైంది? అంత బాగా ఎలా నటించారంటూ కమల్ పై చిరంజీవి పోగ‌డ్త‌ల‌ వర్షం కురిపించారు. కాగా చిరంజీవి నటించిన ఆరాధన చిత్రంలో చిరంజీవి కమలహాసన్ ను ఇమిటేట్ చేస్తూ ఎంతో ప్రయత్నించినప్పటికీ కమలహాసన్లా న‌టించ‌లేక‌పోయిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.