*వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసిన మేకపాటి విక్రమ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి*
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డిలు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాబోయే రోజుల్లో తమ నియోజకవర్గాల పరిధిలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి, పార్టీ విషయాల గురించి చర్చించారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఏ కార్యకర్త అధైర్యపడకుండా తీసుకుంటున్న చర్యల గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియచేశారు.
Comments are closed.