
తెలుగుదేశం కూటమిపై వైసీపీ విష ప్రచారం! కూటమి ప్రభుత్వంపై సజ్జల కుట్ర? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది చంద్రబాబు.
ఎన్నో ఏళ్లుగా పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది ..
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్…

విజయవాడ ఆగస్టు 3
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి వైసీపీ నేతలు సజ్జల కుట్రాలకు తెరతీసారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ విమర్శించారు విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చీమకుట్టిన తెలుగుదేశం నేతలు హత్యలు చేశారని? రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతిన్నాయని వైసీపీ నేతలు విష ప్రచారం చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు, రాష్ట్రంలో ఎక్కడ హత్యలు జరిగాయి సజ్జల జగన్ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై సజ్జల బహిరంగంగా విమర్శించడం సిగ్గుచేటు అన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై సజ్జల కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు గత ఇదేళ్లలో వైసీపీ హయాంలో పేద ప్రజల దగ్గర ఉన్న భూములను కబ్జా చేశారని ఆ భూములు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో వైసిపి పాలనలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీ పేర్లు పెట్టి వైసీపీ నేతలు రుణాలు పొందాలని ఆయనే విమర్శించారు రైతుల పేరుతో నకిలీ పుస్తకాలు సృష్టించారని ఆయన ఆరోపించారు ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని ఆయన విమర్శించారు,
తెలుగుదేశం ప్రభుత్వం అన్ని తరగతులకూ సమన్యాయం జరగాలని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే మొదటిసారి ఎస్‌సి వర్గీకరణపై ముందడగు వేసిందని ఆయన తెలిపారు సామాజిక న్యాయం గెలవాలనేది టిడిపి సిద్ధాంతమని, అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడిలు అమలు చేసి దళితులకు న్యాయం చేశారని ఆయన కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక దళితు బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు. అన్ని తరగతులకూ సమన్యాయం జరగాలని వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులు అండగా నిలిచారన్నారు. దళితులు ఐక్యంగా వుండి అభివృద్ధి సాధించాలని, ఆర్థికంగా సామాజికంగా దళితుల జీవితాల్లో వెలుగులు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారని ఆయన తెలిపారు గత ఐదేళ్లగా అమరావతి రాజధాని పనులు మూల పడగా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో అమరావతి రాజధాని లోఅభివృద్ధి పనులు అతి వేగంగా పరుగులు తీస్తున్నాయని ఆయన తెలిపారు అమరావతి రాజధానిలో హైవేకి సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం కరకట్ట కు నాలుగు లైన్లుగా విస్తరణ పనులు ఇన్నర్ ఓటర్ రింగ్ రోడ్డు తో పనులు ప్రారంభవుతున్నాయని ఆయన తెలిపారు
Comments are closed.