
రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరిగాయో జగన్ చెప్పాలి,! చంద్రబాబు పై విష ప్రచారం చేయటం మానుకోండి,! టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్..
అమరావతి ఆగస్టు 6.
అమరావతి రాజధాని లో అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ తెలిపారు, అమరావతిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అమరావతి రాజధాని లో పనులు ఎక్కడికక్కడా ఆగిపోయాయని ఆయన విమర్శించారు చంద్రబాబు హయాంలో 82% పనులు పూర్తి చేస్తే, జగన్ అమరావతి రాజధానిని సర్వనాశనం చేశాడని ఆయన విమర్శించారు
అమరావతి రాజధాని లో ఆగిన మాస్టర్ ప్లాన్, ఐకాన్ బ్రిడ్జ్‌ల నిర్మాణాలతో అమరావతి రాజధాని ప్రాంతమంతా పూర్వ వైభవం రాబోతోందని ఆయన తెలిపారు, రాష్ట్రంలో

కూటమి ప్రభుత్వమే రావాలని పూజలు చేసిన రైతులకు కౌలు, పెన్షన్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన తెలిపారు అమరావతి రాజధానిలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఆయన తెలిపారు
మోదీ 3.0 అమరావతికి రూ. 15 వేల కోట్ల కేటాయింపుతో సంపద కేంద్రంగా అమరావతి రాజధాని మారబోతోందని
ఫౌండేషన్లు బేష్ అని నిపుణులు ఇచ్చిన నివేదికతో పనులు మరింత ఊపందుకోనున్నాయాని ఆయన తెలిపారు అమరావతి రాజధాని

విధ్వంసం చేసి చంపేసి 3 రాజధానులన్న జగన్‌కి ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా? అని ఆయన విమర్శించారు రాష్ట్రములో ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు రాష్ట్రములో లాండ్ లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుందని ఎక్కడ దాడులు జరిగాయో? నాగార్జున ప్రభుత్వానికి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రులు నేతలు విష ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు చంద్రబాబు వాట్సప్ గ్రూపు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు వాట్సాప్ గ్రూప్ పై విష ప్రచారం మాజీ మంత్రి పేర్నా నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు, చంద్రబాబుపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేసిన వారు ఎంతటి వారైనా వారిని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు
Comments are closed.