The South9
The news is by your side.

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

*పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం పలు కుటుంబాలను పరామర్శించారు.*

after image

*ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో సిండికేట్ ఫార్మర్స్ సొసైటి చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి బావ, విద్యుత్ ఉద్యోగి కలికి రవీంద్రనాధ్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి ఉత్తరక్రియలకు ఎమ్మెల్యే హాజరై కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కలికి రవీంద్రనాధ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.*

 

*అనంతసాగరం మండలం మినగల్లలోని సొసైటి చైర్మన్ కేతా రామకృష్ణారెడ్డి తల్లి కేతా రామరత్నమ్మ మృతి చెందడంతో గురువారం ఉత్తరక్రియలకు హాజరైన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేతా రామరత్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.*

 

*మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామంలో మాజీ సొసైటి చైర్మన్ చెన్ను శ్రీధర్ రెడ్డి మాతృమూర్తి చెన్ను భారతమ్మ మృతి చెందడంతో గురువారం ఉత్తక్రియలకు హాజరైన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చెన్ను భారతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.