The South9
The news is by your side.

సంక్షేమ సారధి వెంట నడిచేందుకు అందరూ సిద్దం పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వనించిన ఎంపీ విజయసాయిరెడ్డి

post top

*సంక్షేమ సారధి వెంట నడిచేందుకు అందరూ సిద్దం*

*: పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వనించిన ఎంపీ విజయసాయిరెడ్డి*

 

రాష్ట్రంలో ప్రజలందరికి సంక్షేమం అందచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట రానున్న 2024 ఎన్నికల్లో నడిచేందుకు సిద్దంగా ఉన్నారని నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యులు వీ విజయసాయిరెడ్డి అన్నారు.

 

after image

ఆదివారం నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్ఘంలోని పలు మండలాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు మాజీ ప్రతినిధులు వైఎస్సార్సీపీలోకి చేరారు.

 

సంగం మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, పీయేసీయస్ అధ్యక్షుడు పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి, సంగం మండల మాజీ వైఎస్సార్సీపీ కన్వీనర్ కంటాబత్తిన రఘునాధరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు తుంగా ఇందూదర్ రెడ్డి, జెసీయస్ కన్వీనర్ ముడి మల్లికార్జునరెడ్డి, సంగం మాజీ ఎంపీపీ మధురెడ్డిల ఆధ్వర్యంలో పెరమనకు చెందిన మాజీ సర్పంచ్ ఇనగంటి బసిరెడ్డి, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ డేగా మధుసూధనయ్య, పాశం శ్రీనివాసులు పార్టీలోకి చేరడంతో వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు.

 

అనంతసాగరం ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ, జెసీయస్ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, బట్రెడ్డి జనార్థన్ రెడ్డి గుడిగుంట వైఎస్సార్సీపీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో అనంతసాగరం మండలం చిలకలమర్రికి చెందిన దొమ్మరాజు సురేందరరాజు, డీ హేమంత్ రాజు, బీ దొరబాబు, ఎం మల్లికార్జున, సీహెచ్ సాయి, ఎం సురేష్, ఎం హరీష్ తదితరులు పార్టీలో చేరడంతో వారికి కూడా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.

 

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, ప్రతి ఒక్కరం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.