
అమరావతి : గత కొంత కాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణ రాజు ని ఆంధ్ర సిఐడి పోలీసులు కొద్దిసేపు క్రితం అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా రాజధాని రచ్చబండ అనే కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు . ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం , ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ఏక వచనంతో సంబోధించడం తో విమర్శలు వ్యవహారం పతాక స్థాయికి చేరింది . ఈ నేపథ్యంలో ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తూ, విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని పలు సెక్షన్ల పై సిఐడి కేసు నమోదు చేసింది. దీనితోపాటు సాంకేతికంగా ఎవరెవరు సహకరించారు అనే విషయంపై సిఐడి దృష్టి పెట్టనుంది. ఈ కేసుని సి.ఐ.డి చీఫ్ సునీల్ కుమార్ విచారిస్తున్నారు. అయితే ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసే విధానం సరిగాలేదని ఎంపీ తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయగా రేపు 10 గంటలకు వాయిదా పడింది. మొత్తానికి ఈ టోటల్ ఎపిసోడ్ లో రఘురామకృష్ణరాజు రచ్చబండ రాజధాని ఎపిసోడ్ ని క్లైమాక్స్ కి చేర్చాడు అనుకోవాలి.
Comments are closed.