The South9
The news is by your side.

ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోండి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

*ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోండి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: జగనన్న పిలుపుతో మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటెయ్యండి*

*: చేజర్ల మండలంలో ఎమ్మెల్యే ముమ్మర ప్రచారం*

 

రెండు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం చేజర్ల మండలం కాకివాయి, కండాపురం, చిత్తలూరు గ్రామాలలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

after image

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉందని, ప్రచార కార్యక్రమంతో పాటు ప్రజలకు ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండాలని తెలుపుతున్నామని అన్నారు. ఐదు సంవత్సరాల ఒక ప్రభుత్వం ఎలా పనిచేసిందో ప్రజలందరూ గమనించాలని, ఈ రెండు రోజుల ప్రభావంతో ప్రజలు మారిపోకూడదని అన్నారు.

 

Post midle

ప్రతిపక్ష పార్టీల నాయకులు బెదిరింపు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి బెదింపులను ఎవరూ లెక్కచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించేందుకు కోట్లాది రూపాయలను జగనన్న అందచేయడం జరిగిందని వివరించారు.

 

కాకివాయి గ్రామంలో 250 ఎకరాల్లో రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కోట్లాది రూపాయలు సంక్షేమాన్ని అందించడం జరిగిందని అన్నారు. ఐదేళ్ల పాటు జగనన్న పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని, రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్ర ప్రజలు ఆర్థికాభివృద్ది సాధించేందుకు జగనన్నకు మద్దతు తెలపాలని, సంక్షేమ ప్రభుత్వ సాధన కోసం మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.