The South9
The news is by your side.

సంక్షేమ, అభివృద్ది ప్రణాళిక సిద్దం చేయండి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

after image

సంక్షేమ, అభివృద్ది ప్రణాళిక సిద్దం చేయండి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

 

*సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమిష్టిగా సర్వే నిర్వహించి సంక్షేమ, అభివృద్ది ప్రణాళిక సిద్దం చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*

 

*వావిలేరు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ పర్యటనకు వచ్చిన ఆయన తొలుత సచివాలయంలో పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.*

 

Post Inner vinod found

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం నవరత్నాల సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వాటిని అందించే బాధ్యత మీ అందరిపై ఉందని సూచించారు.*

 

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సర్వే నిర్వహించాలని సూచించి ఉన్నామని, ఈ సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, అర్హత కలిగి సంక్షేమ పథకాలు రాని వివరాలు, నిరుద్యోగులు, చదువుకుంటున్న వారి వివరాలు మొత్తం తెలుస్తాయని అన్నారు.*

 

*ఈ సర్వే పూర్తి చేస్తే గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ పరిధిలో గ్రామాల అభివృద్ది కోసం ఇచ్చిన నిధులతో వాటిని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తామని అన్నారు.*

 

*తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. అందరూ సమిష్టికి సర్వే పూర్తి చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకుంటూనే అభివృద్ది చేసుకోవచ్చునని సూచించారు.*

Post midle

Comments are closed.