The South9
The news is by your side.

వాహనాలపై “PRESS” స్టిక్కర్లు – నకిలీ జర్నలిస్టుల పెరుగుదలపై ఆందోళన

post top

🟥 వాహనాలపై “PRESS” స్టిక్కర్లు – నకిలీ జర్నలిస్టుల పెరుగుదలపై ఆందోళన

📍 South9 డెస్క్:

రాష్ట్రంలో వాహనాలపై “PRESS” స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతున్న వారిలో చాలా మంది నకిలీ జర్నలిస్టులే అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అర్హత లేకుండా, సరైన అవగాహన లేకుండా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారి కారణంగా సమాజానికి హాని కలుగుతోందని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కావడంతో, కొత్త పత్రికల పేర్లతో అనేక మంది జర్నలిస్టులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జర్నలిజం విలువ తెలియని వారు కూడా ప్రెస్ కార్డులు పొందుతూ, దాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

after image

కొంతమంది వృత్తి పరంగా సంబంధం లేని వారు — ఇతర పనులు చేస్తూ, ప్రెస్ కార్డులు చూపిస్తూ అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. కొన్ని సందర్భాల్లో బ్లాక్‌మెయిల్, మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. పత్రిక యాజమాన్యాలు డబ్బుల కోసం నిర్ధారణ లేకుండా ప్రెస్ కార్డులు జారీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే జిల్లా సమాచారం శాఖ అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులకు ప్రెస్ కార్డులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Post midle

జర్నలిజం వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు నకిలీ జర్నలిస్టులను పూర్తిగా నిరోధించాలని, నిజమైన విలేకరులకు రక్షణ కల్పించాలని, ఇందుకు జర్నలిస్ట్ సంఘాలు మరియు అక్రిడిటేషన్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.