
south9 ప్రతినిధి

ప్రస్తుతం తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదని ఏఐసీసీ అగ్రి నాయకురాలు వయనాడు లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ అన్నారు వయనాడులో ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం ఇస్తారని భావిస్తున్నానని తెలిపారు వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి వారికి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా కొండ చరియలు విరిగిపడిన వయనాడు ప్రజలకు కేంద్రం నుంచి సహాయం అందలేదు కదా అని మీడియా ప్రతినిధులు వివిధ అంశాలపై ప్రశ్నించారు దానికి ప్రియాంక గాంధీ స్పందిస్తూ తాను ఇలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలచుకోలేదన్నారు 2019 2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడు నుంచి రాహుల్ గాంధీ రెండుసార్లు గెలిచారు రెండు స్థానాలు గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు దీంతో ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ సిపిఐ నుంచి సత్యన్ మోకేరి, బిజెపి నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు
Comments are closed.