The South9
The news is by your side.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

తెలంగాణ : ‌ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈనెల చివర్లో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అని సువర్ణభూమి ఇన్ఫ్రా సంస్థ అధినేత బొల్లినేని శ్రీధర్ తెలిపారు. గతంలో ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్లుగా దివంగత ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ వ్యవహరించేవారు.

Post Inner vinod found

అయితే ఇప్పుడు నూతన బ్రాండ్ అంబాసిడర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తీసుకోవడంతో మా సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా క్రెడిబులిటి ఇంకా పెరుగుతుందని అధినేత బొల్లినేని శ్రీధర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో ఈరోజు పలక్ నామప్యాలెస్ లో యాడ్ షూటింగ్ ప్రారంభమయ్యింది. ఆ చిత్రాల ను ఎక్స్ క్లూజివ్ గా ‘ద సౌత్ 9’మీకు అందిస్తుంది.. ఈ యాడ్ షూటింగ్ కెమెరా మెన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్  ‘దబు రథా ‘ని వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమంలో సువర్ణభూమి ఇన్ఫ్రా ఎండి బొల్లినేని శ్రీధర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post midle

Leave A Reply

Your email address will not be published.