మీ అందరికీ ఓటు హక్కు కల్పించిన ..డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ రుణం తీర్చుకోండి.. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మనపాటి చక్రవర్తి

త్వరలో జరుగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)R.P.I. పార్టీ అభ్యర్థి మన పాటి చక్రవర్తి వెంకటాచలం మండలం లో జోసెఫ్ పేట, ఇస్కపాలెం, పూడిపర్తి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీలో లో పోటీ చేసే అవకాశం కల్పించిన కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి రాందాస్ అథవాలే కి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్ కి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా (మాబు ) కి ధన్యవాదాలు తెలుపుతూ

..ప్రతి ఒక్క ఓటరు నన్ను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలానే జిల్లా అధ్యక్షులు s.k.మాబు మాట్లాడుతూ.. మా అభ్యర్థి మనపాటి చక్రవర్తి కి ఓటు వేయాలని, ప్రతి ఒక్కరి మద్దతు మాకు తెలపాలనిఅలానే సర్వేపల్లి నియోజకవర్గ ఎస్. సి, ఎస్, టి, మైనార్టీ సోదరులు మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాబీ కిరణ్, స్థానిక నాయకులు వెంకటయ్య, సుబ్బారావు. జోసెఫ్ ,తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.