The South9
The news is by your side.

టిడిపి నాయకుల పై రోజా పంచ్.

post top

చిత్తూరు ప్రతినిధి :రాష్ట్రం నుంచి అమర రాజా బ్యాటరీ సంస్థ తరలిపోతున్న టిడిపి నాయకుల ఆరోపణలపై వైఎస్సార్ సీపీ నగర ఎమ్మెల్యే రోజా స్పందించారు. శుక్రవారం చిత్తూర్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ… తెలుగుదేశం నేతల పై , అమర రాజా యాజమాన్యంపై పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో తీవ్రంగా కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై రైట్ చేస్తుంటే తెలుగుదేశం నాయకులు ఎందుకు అంతలా రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అమర రాజా సంస్థతోపాటు రెడె క్యాటగిరి లో ఉన్నా 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. అమర రాజా కంపెనీ నుంచి కాలుష్యం రావడంలేదని ,అన్ని పార్టీల తో కలిసి నిజ నిర్ధారణ కమిటీ వెయ్యాలని, కాలుష్యం వెదజల్లడం లేదని నిరూపించాలని సవాల్ విసిరారు. అలానే కార్మికుల శరీరంలో లెడ్ లేదని అమర రాజా యాజమాన్యం నిరూపిస్తుంది అని అన్నారు. రోజా సవాల్ కి తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.