
టాలీవుడ్ యాక్టర్ సంపూర్ణేష్ బాబు హీరో గానటిస్తున్న చిత్రం బజార్ రౌడి .కరోనా తర్వాత షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో చాలా సినిమా షూటింగ్ లు ప్రారంభం అవ్వడం విదితమే. ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు హీరో గా నటిస్తున్న బజార్ రౌడీ చిత్రానికి సంబంధించిన పోరాట సన్నివేశాలు ను చిత్రీకరిస్తున్నా సమయంలో చిన్న ప్రమాదం జరిగింది అని తెలుస్తుంది. బైక్ మీద హీరో వచ్చే సందర్భంగా సేఫ్టీ వైర్స్ తెగినట్టు తెలిసింది.తృటిలో ప్రమాదం నుంచి బయట పడినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.
Comments are closed.