
ప్రసాద్ స్కీం కింద జోగుళాంబ ఆలయానికి నిధులు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది
నిధులు తెచ్చింది కేంద్రమే…ఇచ్చింది కేంద్రమే,

తామేదో ఘనకార్యం చేసినట్టు ప్రసాద్ స్కీం నిధులు తెచ్చామని ఎమ్మెల్యే మంత్రులు గొప్పలు చెప్పుకోవడం, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం హాస్యాస్పదంప్రసాద్ స్కీం పేరిట జోగుళాంబ ఆలయంలో MLA కు సన్మానమా.? సిగ్గు సిగ్గు*
*జోగుళాంబ ఆలయానికి కేంద్రం నిధులు తగ్గడానికి మీ వైపల్యమే కారణం . బిజేపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..
ఆలయ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రసాద్ స్కీమ్ పేరిట నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి పనుల కొరకు పెద్ద ఎత్తున 37 కోట్ల నిధులు మంజూరు చేసింది
అయితే ఆ నిధులను తాము ఏదో కష్టపడి తీసుకొని వచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది
ఒకవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్విటర్లో పోస్ట్ లు చేస్తుండగా మరోవైపు ఎమ్మెల్యే అబ్రహం తానే నిధులు కష్టపడి తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అని అన్నారు.
నిజాలు ఏంటో తెలుసుకోండి*
జోగులాంబ ఆలయానికి రాష్ట్రం చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా 100 కోట్ల నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది
అనేక పర్యాయాలు సెంట్రల్ టీం కమిటీ అలంపూర్ పర్యటించి ప్రసాద్ కింద చేపట్టవలసిన అభివృద్ధి పనులు గుర్తించారు
అయితే గుర్తించిన పనులకు స్థానిక ఎమ్మెల్యే కానీ దేవస్థానం పాలకమండలి వారు కానీ కనీసం తమ వంతు బాధ్యతగా స్థలం కూడా చూపక పోవడం శోచనీయం.
దీంతో ఒక దశలో వచ్చిన ప్రసాద్ స్కీం కూడా వెనక్కి వెళ్లి పోయే పరిస్థితి ఎదురు కాగా…
రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కృషి ద్వారా ప్రసాద్ స్కీం వెనక్కు తరలిపోకుండా మళ్లీ నిలబడగలిగింది.
అయితే అల్లంపూర్ కోసం తెచ్చిన ప్రసాద్ స్కీమ్ నిధుల నుండి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మణ్యంకొండ ప్రాంతానికి కొంత నిధులను తెలివిగా మళ్లించుకుని వెళ్ళాడు.
స్థానిక ఎమ్మెల్యే మాత్రం నిధులు తగ్గిపోతున్న నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించి ఈ రోజు తాను ఏదో సాధించానని గొప్పలు చెప్పుకోవడం నిజంగా హాస్యాస్పదంగా ఉందిని
ఎమ్మెల్యే కు సన్మా మా.. ? సిగ్గు సిగ్గు …
సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందాగా కేంద్రం నిధులు ఇస్తే ఎమ్మెల్యే ఏదో సాధించినట్లు దేవస్థానం చైర్మన్ తన అధికారాన్ని ఉపయోగించి ఆలయంలో ఎమ్మెల్యే కు సన్మానం చేయాలని ప్రణాళికలు రూపొందించడం సిగ్గుచేటు
నిన్నటికి నిన్న కరోనా వ్యాక్సిన్ విషయంలో గొప్పలు చెప్పుకుని ఇబ్బంది పడిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మళ్లీ జోగులాంబ అమ్మవారి ప్రసాద్ విషయంలో కూడా తెరచాటు గౌరవాన్ని పొందాలనుకోవడం చూడటం సిగ్గుచేటు అని దీని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది* అని అన్నారు .ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.