The South9
The news is by your side.

నిర్ణీత గడువులో సమస్యల పరిష్కారం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

after image

నిర్ణీత గడువులో సమస్యల పరిష్కారం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

 చెర్లోయడవల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించి ప్రజలకు చేరువ కావాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*

*మంగళవారం ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధికారులతో కలసి రివ్యూ చేపట్టారు.*

Post Inner vinod found

*ఈ సందర్భంగా పించన్లు, రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో అభివృద్ది పనులపై సమీక్షలో చర్చించారు. గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.*

*ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వాల కంటే మిన్నంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పథకాలపై మిగతా రాష్ట్రాలు శ్లాఘిస్తున్నాయని అన్నారు.*

*కరోనా కష్టకాలంలో సైతం లెక్క చేయక నవరత్నాల పథకాలను అర్హులైన లబ్దిదారులందరికి అందచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనన్నారు.*

Post midle

*గ్రామాల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద కనబర్చాలన్నారు. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.*

Post midle

Comments are closed.