The South9
The news is by your side.

నటుడిగా నన్ను మరికొన్ని మెట్లు ఎక్కించే మంచి చిత్రం.

post top

నటుడిగా నన్ను మరికొన్ని

మెట్లు ఎక్కించే మంచి చిత్రం

గోసంగి సుబ్బారావు “బిగ్ బ్రదర్”

అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్

after image

*శివ కంఠంనేని*

 

చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… దర్శకసంచలనం, “రాజమౌళి ఆఫ్ రాజమౌళి” గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్”. రేపు (మే 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది. “లైట్ హౌస్ సినీ మ్యాజిక్” పతాకంపై కె.ఎస్.శంకర్ రావు – ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి – అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్ శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది!!

Post midle

ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ… “గోసంగి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్”. ఈ చిత్రం నటుడిగా నన్ను మరి కొన్ని మెట్లు ఎక్కిస్తుంది. నటుడిగా నాకు మళ్ళీ అవార్డులు తెచ్చే ఈ చిత్రం మా నిర్మాతలకు రివార్డులు కూడా తెచ్చిపెట్టి, వారు మరిన్ని మంచి సినిమాలు తీసేందుకు దోహదపడుతుంది” అన్నారు!!

 

శ్రీసూర్య, ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.ఎస్.శంకర్ రావు – ఆర్.వెంకటేశ్వరరావు, రచన – దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.