
చెన్నై ప్రతినిధి : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ నెల 7న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకోనున్నారని తెలిసింది. ఈరోజు జరగనున్న ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకె) శాసన సభా పక్ష సమావేశం లో శాసనసభ్యులు స్టాలిన్ ను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ తో పాటు మరో 29 మంది మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నిన్న రాత్రి చెన్నై మెరీనా బీచ్ నందు తండ్రి కరుణానిధి సమాధిని దర్శించి నివాళులు అర్పించిన స్టాలిన్, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Comments are closed.