కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
తేదీ: 11-11-2021,
న్యూఢిల్లీ.
*కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*పీఎల్ఐ స్కీం కింద దేశంలో ఏర్పాటు చేయనున్న మూడు విద్యుత్ ఉపకరణ జోన్లల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి మేకపాటి*
*భారీ విద్యుత్ ఉపకరణాల జోన్‌గా మన్నవరం మంత్రి మేకపాటి అనుకూలమని వెల్లడి*
*గతంలో ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్కు కేటాయించిన 750 ఎకరాల భూమిని ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ గా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి మేకపాటికి తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్*
*మన్నవరం విద్యుత్ ఉపకరణాల జోన్‌పై త్వరలో ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో సమావేశం*
*రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వాణిజ్య ఉత్సవం- 2021ని అభినందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్*
*కొప్పర్తిలో భారీ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు గురించి కేంద్ర మంత్రి పీయూష్ దృష్టికి తీసుకువెళ్లిన మంత్రి మేకపాటి*
*ఆత్మనిర్భర్ భారత్ కింద ఏడు టెక్స్టైల్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్న కేంద్రం*
*విశాఖ-చెన్నై కారిడార్‌లో రాష్ట్ర వాటాను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని వినతి*
*డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి మంత్రి మేకపాటి ప్రతిపాదనను గతిశక్తిలో ఏపీ భాగస్వామ్యం అవడం ద్వారా సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ వెల్లడి*
*రాష్ట్ర ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్*
*విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన మంత్రి మేకపాటి*
*హాజరైన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ,పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు
Comments are closed.