
*తేది: 28-06-2023*
* కురుపాం*
జగనన్న అమ్మ ఒడి’ కింద 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేసిన సీఎం జగన్.
*నాలుగవ ఏడాది అమ్మఒడి తో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి*
*బటన్ నొక్కటమంటే ఇదీ అని ఆ బుడుద్దాయిలకు చెప్పండి : సీఎం జగన్*
*చదువులతో అంటరానితనాన్ని రూపుమాపాం.. పెత్తందారులకే అందుబాటులో ఉన్న కార్పొరేట్ చదువును నా పేద పిల్లలకు అందుబాటులోకి తెచ్చాం*
*రాష్ట్రంలో మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దనే 4 కోతులు*

*నమ్మించి నట్టేట ముంచడమే దుష్ట చతుష్టయం నీతి*
“ఈ నాలుగేళ్లలో విద్యారంగంలో నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. చదువులో అంటరానితనాన్ని రూపు మాపగలిగాం. ఆ పెత్తందారులకే అందుబాటులో ఉన్న చదువును నా పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకురాగలిగాం. నా పేద పిల్లల్లో ఏ ఒక్కరు పేదరికం కారణంగా చదువు ఆగకూడదనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల భవిష్యత్తు కోసం విద్య పై పెట్టుబడి పెడుతున్నాం.” సీఎం జగన్ పేర్కొన్నారు.
వరుసగా నాల్గవ ఏడాది ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని సీఎం జగన్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేడు 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశామని తెలిపారు. తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని సీఎం పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఈ నాలుగేళ్లలో విద్యా రంగంపై మన ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. లంచమనే మాట లేకుండా బటన్ నొక్కటమంటే ఇదని ఆ బుడుద్దాయిలకు చెప్పమని సీఎం అన్నారు.
విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించామని, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కారాదనే సంకల్పంతో విద్యారంగంపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితిని కల్పించమని అన్నారు.

*నాలుగేళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం: సీఎం జగన్*
పేద విద్యార్థులను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ విధానంలో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నాట్లు సీఎం పేర్కొన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఉచితంగా అందిస్తున్నామని, పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నాడు–నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో ఆరు, ఆపై తరగతుల నుంచి డిజిటల్ తరగతి గదులను, ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి ప్రపంచంతో పోటీ పడేలా వెన్ను తడుతున్నామని ఉద్ఘాటించారు.
*విద్యారంగంలో దేశానికే దిక్సూచిగా మన రాష్ట్ర ప్రభుత్వం*
మన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత చదువులు చదివేలా జగనన్న విదేశీ విద్యా దీవెనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఆదుకుంటున్నామని, స్పోకెన్ ఇంగ్లీషులో నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షలకు సన్నద్ధం చేసి సర్టిఫికెట్లు అందించేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈమేరకు అమెరికా సంస్థ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కాగా విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతే కాకుండా అమ్మ ఒడి తల్లులకు సీఎం విజ్ఙాప్తి చేశారు. వారి పిల్లలు చదివే బడుల టాయిలెట్స్, మెయిటనెన్స్ కోసం రూ.2000 డోనేట్ చేయమని తల్లదండ్రులను సీఎం జగన్ కోరారు.
2018-19 అంటే చంద్రబాబు హయంలో ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ 84.49% ఉందని అది ఇప్పుడు గణణీయంగా 100.8%నికి పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న 67మంది విద్యార్ధులు NIT, IIT, IIMలో చదివే అవకాశం పొందటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే నెలలో గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 84% మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలే ఉండటం గమనార్హమని అన్నారు.
“పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. మన పిల్లలు రేపు సత్యనాదేళ్లతో పోటీ పడాలి. ఒక్క సత్య నాదేళ్ల కాదు ..ప్రతి కుటుంబం నుంచి సత్య నాదేళ్ల రావాలి. చదవలేని పరిస్థితి ఉండకూడదని ప్రపంచంలోనే టాప్ 50 కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా సరే కోటి 25 లక్షల రూపాయల వరకు పూర్తి ఫీజును భరించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే. ఈ రోజు స్టాన్‌పోర్డ్, పెద్ద పెద్ద కాలేజీల గురించి మాట్లాడితే లక్షల్లో ఫీజులు ఉంటాయి. ఆ ఫీజులు కట్టలేని తల్లిదండ్రులకు తోడుగా ఈ రోజు ఆ ఫీజులు కోటి 25 లక్షలు అయినా ఫర్వాలేదు. మీ మేనమామ భరిస్తాడని సగర్వంగా చెబుతున్నాను” సీఎం జగన్ అన్నారు.
*రాష్ట్రంలో మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దనే నాలుగు కోతులు*
ఇంత మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని, ఇంత మంచి కనిపిస్తున్నా కూడా జీర్ణించుకోని వారు కొంత మంది ఉన్నారని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు, ఆ నాయకుడి కోసం 15 ఏళ్ల క్రితమే పుట్టిన ఓ దత్త పుత్రుడని విపక్షాల పై సీఎం విమిర్శల జల్లు కురిపించారు. వీళ్లు టీడీపీ (తినుకో, దోచుకో, పంచుకో)తో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ , బొజ్జలు పెంచుకుంటూ, బొజ్జ రాక్షసుల పత్రికలు, టీవీలు అన్నీ కూడా మనల్ని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పటి పరస్థితుల్లో మహాత్మా గాంధీ గారి మూడు కోతులు గుర్తి వస్తున్నాయని, ఇవిచెప్పే నీతి చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అన వద్దు అని ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు అని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయని, వీరినే దుష్ట చతుష్టయం అని పిలుస్తుంటామని దుయ్యబట్టారు. వీరికి అధికారం ఎందుకు కావాలంటే అవినీతితో దోచుకోవడం, నమ్మించి మోసం చేయడమే వారికి తెలిసిన ఏకైక నీతి అని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచి చేయని చంద్రబాబు..మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికి మంచి చేయలేదని గుర్తిచేశారు.
*వారాహి ఎక్కి నోటికి అద్దు అదుపు లేని మాటలు*
“ఈ ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వారహి అంటా.. ఈ లారీ ఎక్కి ఊగిపోతూ..తనకు నచ్చని వారిని చెప్పు తీసుకుని కొడతా అంటాడు. తాటా తీస్తా, గుడ్డలు ఊడదీసి కొడతా అంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు. ఈ మనిషికి నిలకడ లేదు. వారిలా పూనకం వచ్చినట్లు మనం ఊగుతూ మాట్లాడలేం. రౌడీల్లా మీసాలు మెలేయలేం. రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా బూతులు తిట్టలేం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పెటెంట్.” అని పవన్ పై సీఎం మండిపడ్డారు.
దుష్ట చతుష్టయం పునాదులు సమాజాన్ని చీల్చేలా ఉంటాయని, కానీ మన పునాదులు పేదల పట్ల ప్రేమ నుంచి, రైతుల మమకారం నుంచి అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల బాధ్యతలోనుంచి పుట్టాయని పేర్కొన్నారు. మన పునాదులు నేరుగా బటన్ నొక్కే డీబీటీ నుంచి పుట్టాయని వారిలా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం కాదని అన్నారు. సింగపురంలో మినీ రిజర్వాయర్ కోసం రూ.38 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి, ఎత్తిపోతల ప్రాజెక్ట్, క్రాసింగ్ నెట్ ప్లాంట్‌ను కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
Comments are closed.