The South9
The news is by your side.
after image

స్కంద’ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ పాట విడుదల

ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ పాట విడుదల

 

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు పాట విడుదలైయింది.

 

కంపోజర్ ఎస్ థమన్ మాస్ బీట్‌లతో చాలా రిథమిక్‌గా ఉండే క్రేజీ లిరిక్స్‌తో పెప్పీ, మాస్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. పాట మూడ్ టెంపోను ఎనర్జిటిక్ గా చేశారు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే హుషారుగా పాడిన ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్‌ మరింత ఆకర్షణగా నిలిచాయి.

 

రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల, రామ్‌ ఎనర్జీ ని మ్యాచ్ చేసింది. ఇద్దరూ ఎలిగెంట్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. కాస్ట్యూమ్స్‌, కలర్‌ఫుల్‌ సెట్‌ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

 

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

 

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

 

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల

Post midle

సాంకేతిక విభాగం:

Post Inner vinod found

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్

సంగీతం: ఎస్ఎస్ థమన్

డీవోపీ: సంతోష్ డిటాకే

ఎడిటింగ్: తమ్మిరాజు

#RAmPOthineni

#SkandaOnSep15

Post midle

Comments are closed.