The South9
The news is by your side.
after image

గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారతాయ్: సీఎం వై.యస్ జగన్.

post top

 

*తేదీ: ఫిబ్రవరి 10, 2023*

*ప్రజల సాధికారతకు విద్య తొలి అడుగు*

*4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల విడుదల చేసిన సీఎం*

*గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారతాయ్: సీఎం జగన్మోహన్ రెడ్డి *

Post Inner vinod found

ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తోన్న ‘వైఎస్సార్‌ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. *పేదవాడి మీద పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చు కింద భావించడం లేదని.. పిల్లలకు ఇచ్చే ఆస్తి కింద ఇస్తున్నామన్నారు సీఎం. ఆ కుటుంబ సభ్యుడిగా ఆ కుటుంబంలో ఉన్న మహిళలకు అన్నగా, తమ్ముడిగా అండగా నిలబడే కార్యక్రమం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.*

*గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారతాయ్: సీఎం జగన్మోహన్ రెడ్డి

Post midle

గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆడపిల్లలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్‌ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంద‌న్నారు. 2022 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి ఈరోజు నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా.. లంచాలకు తావులేకుండా ఈ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

*అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది*

ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనసరి. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ముళ్లకు 21 ఏళ్లుగా నిర్దేశించాము. *పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ చదువులు ఆగిపోకూడదు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది.* పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నాము. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం బీసీల కుతాంతర వివాహాలకు రూ.50వేలు ప్రకటిస్తే.. మన ప్రభుత్వం రూ.75వేలు అందిస్తోంది. మైనారీలకు వాళ్లు రూ.50వేలు ప్రకటిస్తే మనం లక్ష రూపాయలు ఇస్తున్నాము. భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నాము. గతంలో వికలాంగులకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించి వారిని మోసం చేస్తే మన ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకుని లక్ష50వేల రూపాయలు అందిస్తోందన్నారు. *దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు పెళ్లిలు అయిన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.*

Post midle

Comments are closed.