The South9
The news is by your side.

వివాదరహితులు న్యాయవాది మన పాటి సాల్మన్

post top

ప్రముఖ రంగస్థల నటుడు, ఆలిండియా లాయర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు మన పాటి సాల్మన్ కి ఘనంగా నివాళులర్పించింది నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్. బార్ అసోసియేషన్ లో ఏ న్యాయవాది మరణించిన వారిని స్మరించుకుంటూ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే మరణించిన మన పాటి సాల్మన్, మరొక న్యాయవాది జోసెఫ్ లకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐలు నాయకులు, న్యాయవాదులు పాల్గొని, మనపాటి సాల్మన్ చేసిన సేవలను కొనియాడారు. న్యాయవాదివృత్తిని దైవంగా భావించి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఉచితమైన సేవలు అందించారని,వక్తలు అన్నారు. అలానే అందరితో మంచిగా ఉంటూ వివాదరహితుడుగా పేరు పొందారనీ, ఆయన మరణం వారి కుటుంబ సభ్యులతో పాటు సహచరులైన మాకు కూడా తీవ్ర ఆవేదనకి గురి చేసిందని భావిద్వేగానికి లోనయ్యారు.

after image

ఈ కార్యక్రమంలో ఐలు నాయకులు న్యాయవాదులు బివి రమణారెడ్డి, శ్రీధర్, అంకయ్య, జల్లి పద్మాకర్, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, దైవ దినం, రమేష్ తోపాటు మరికొందరు న్యాయవాదులు, మనపాటి సాల్మన్ కుమారుడు, సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి, క్రైమ్ హెడ్ మున్నా, రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.