సౌత్ 9 ప్రతినిధి :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్స్ అంటే ప్రేక్షకులు చెవులు కోసుకుంటారు ఆయన అభిమానులు ఆయన నుంచి హై ఎనర్జిటిక్, ఊరమాస్ స్టెప్పులను కోరుకుంటారు. ఇక దర్శకుడు సుకుమార్‌ది దర్శకునిగా విభిన్నశైలి. చిత్రీకరణ ఎంతో స్టైలిష్‌గా ఉండి ఉన్నతంగా సాగుతుంది. అదే సమయంలో ఊరమాస్ ప్రేక్షకుల కోసం అదిరిపోయే ఒక ఐటం సాంగ్ ఉంటుంది.తన ప్రతి చిత్రంలోను ఊర మాస్ సాంగ్ ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతూ ఉంటారు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప 1 ఈ చిత్రంలో అల్లు అర్జున్ సమంత మధ్య వచ్చే ఉ…అంటావా మావా…ఉఉ అంటావా ఐటెం సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు పుష్ప2 మీద ఉంది ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది రెండేళ్ల చిత్రీకరణ జరుపుకొని విడుదలకు ముస్తాబ వుతోంది ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరి మధ్య ఉంటుంది అనే సస్పెన్స్కు తెరదించుతూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్ లో డాన్సింగ్ డాల్గా గుర్తింపు తెచ్చుకుంటున్న శ్రీలీల పుష్ప టు లో అల్లు అర్జున్ పక్కన ఐటెం సాంగ్ ఉంది త్వరలో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ పాట గాను దేవిశ్రీప్రసాద్ ఓర మాస్ ట్యూన్‌ను అందిస్తుండగా చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు మరి ఈ పాట ఏ రేంజిలో హిట్ అవుతుందో వేచి చూడాలి
Comments are closed.