The South9
The news is by your side.

ప్రధానమంత్రి మోదీ, సీఎం జగన్ కలయికతో హోరెత్తిన విశాఖ

post top

 

*తేదీ: 12-11-2022*

*స్థలం: విశాఖపట్నం*

*ప్రధానమంత్రి మోదీ, సీఎం జగన్ కలయికతో హోరెత్తిన విశాఖ*

*ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ఘాటించిన సీఎం జగన్, ప్రతి పైసాను ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతంగా, పారదర్శకంగా వినియోగించమని స్పష్టం*

after image

విశాఖ వేదికగా రాష్ట్రం లో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ, సీఎం జగన్ కలయికతో విశాఖపట్నం హోరెత్తింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రా అభివృద్ధికి బాటలు వేసేందుకు తామిద్దరు సమష్టిగా పనిచేస్తున్నాం అని తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉందని సీఎం జగన్ నొక్కిచెప్పారు, ‘కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది మాకు రాష్ట్ర అభివృద్ధి తప్ప మరో ఎజెండా లేదు’ అని ఉద్ఘాటించారు .

ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక కీలక సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సిందిగా కోరారు. విభజనకు సంబందించిన హామీలగురించి మాట్లాడుతూ పోలవరం నుంచి ప్రత్యేకహోదా వరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ ఏర్పాటు వరకు మీరు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు వాటినన్నిటిని కూడా పరిష్కరించాలని కోరారు సీఎం జగన్.

Post midle

రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ప్రతి రూపాయిని, కేంద్రం కేటాయించిన నిధులను పూర్తి పారదర్శకతతో ప్రజల సంక్షేమం కోసం సక్రమంగా వినియోగిస్తున్నామని తెలియజేసారు. విద్య, వ్యవసాయం, మహిళా సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్యం, ఆరోగ్యం, సామాజిక న్యాయం, అభివృద్ధి మరియు వికేంద్రీకరణ వంటి ఉన్నతమైన లక్ష్యాలతో కేవలం 3.4 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రం అభివృద్ధి పదం లో ముందుకు వెళ్తుంది. 10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసినందుకు ప్రజల తరపున ప్రధానమంత్రికి హృదయపూర్వక శుభాకంక్షాలు తెలియజేసారు

*దేశ నిర్మాణంలో ఆంధ్ర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది*

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ నలుమూలలలో అనేక విజయాలను సాధిస్తున్నారని ప్రశంసించారు. అది కేవలం నైపుణ్యం వల్లే సాధ్యం కాదని వారిలో ఉన్న కలుపుగోలు తనం, స్నేహశీలత, వల్లే ప్రపంచం లో వివిధ రంగాల్లో రాణించగలుగుతున్నారని కొనియాడారు. విద్య, వ్యవస్థాపకత, సాంకేతికత, వైద్య వృత్తి ఇలా ఏదైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. ఈ గుర్తింపు వృత్తిపరమైన లక్షణాల ఫలితంగా మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజల సంకల్పం కారణంగా కూడా ఉంది. దేశం యొక్క అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది అని కొనియాడారు.

రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ చేస్తున్న పనుల వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, రాష్ట్ర అభివృధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని, జగన్ కోరిన విధంగా పోలవరం, రైల్వే జోన్ విషయాలని పూర్తి చేస్తూ రాష్ట్రంలో చేపట్టబోయే ఇతర ప్రాజెక్ట్స్ కి తాము అండగా ఉంటామని ప్రధాని మోడీ తెలియచేసారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.