The South9
The news is by your side.
after image

ఐటీ సంస్థల హబ్ గా విశాఖ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీలతో పోటీ :సీఎం జగన్

post top

 

తేది -16–10–2023*

*స్థలం :విశాఖపట్నం*

*ఐటీ సంస్థల హబ్ గా విశాఖ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీలతో పోటీ*

*టైర్ 2 నుంచి టైర్ 1 సిటీగా మారే సామర్థ్యం విశాఖ సొంతం*

*విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్*

 

రాష్ట్రంలో సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి పెద్ద ఎత్తున అడుగులు పడ్డాయని, ఈ తరుణంలో రాష్ర్టంలోని అతి పెద్ద నగరం, పరిపాలనా రాజధాని విశాఖలో ఇన్ఫోసిస్ డేటా సెంటర్ ప్రారంభించుకోవడం హర్షణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్‌ నెంబరు 2 వద్ద నిర్మించిన ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ, లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌, లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ సంస్థలను సీఎం జగన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు నిలంజన్‌ రాయ్‌ (చీఫ్‌ పైనాన్షియల్‌ ఆఫీసర్‌), నీలాద్రిప్రసాద్‌ మిశ్రా (వైస్‌ ప్రెసిడెంట్‌)లతో కలిసి ఇన్ఫోసిస్ కాన్ఫరెన్స్ హాలులో సీఎం జగన్ ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవంలో తాను భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉందని, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆ స్ధాయిలో ఈ నగరానికి ప్రభుత్వ సహాకారం అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదని, ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదన్నారు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం విశాఖలో ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్‌ నగరంలోనే ఏర్పాటు అయ్యాయని తెలిపారు. అప్పట్లో విశాఖపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న సీఎం జగన్ టైర్ 2 సిటీగా ఉన్న విశాఖకు టయర్‌ వన్‌ సిటీగా ఎదగడానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం అందిస్తుందన్నారు.

 

Post midle

*ఒక్క ఫోన్ కాలం దూరంలోనే మీ సీఎం జగన్*

 

టయర్‌ వన్‌ నగరంగా ఎదగడానికి ఈ రకమైన తోడ్పాడు విశాఖనగరానికి అవసరం. ఆ రకమైన తోడ్పాటును ఇన్ఫోసిస్‌ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నాను. 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యంతో ఉన్న ఇన్ఫోసిస్‌తో పాటు, టీసీఎస్, విప్రో వంటి సంస్ధలు ఏ నగరం యొక్క ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని అయినా పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్‌ వస్తుంది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్‌ కూడా రాబోతుంది.ఇంటర్నెట్‌ కేబుల్‌ మనకు ఎక్స్‌క్లూసివ్‌గా సింగ్‌పూర్‌ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్‌ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్‌ వచ్చింది. అని సీఎం జగన్ పేర్కొన్నారు. నిలంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు వంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీళ్లంతా కచ్చితంగా ఒకరోజు విశాఖ ఐటీలో అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్ముతున్నానని సీఎం జగన్ అన్నారు. ఇవాళ 1000 మందితో ఇక్కడ ప్రారంభం అయిన ఇన్ఫోసిస్‌ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నానట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ ఇన్ఫోసిస్‌తో కలిసి ఐటీ రంగంలో బహుముఖ ప్రగతిని సాధిస్తుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ అవసరం ఉన్నా మేం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉంటానని, దీన్ని పారిశ్రామిక వేత్తలు దృష్టిలో పెట్టుకోవాలని, మీకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడతామని మరోసారి హామీ ఇస్తున్నా అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

*2 పోర్టులు.. రెండేళ్లలో ఇంటర్నేష్నల్ ఎయిర్ పోర్ట్.. సీఎం జగన్*

 

విశాఖపట్నం, గంగవరంలో ఇప్పటికే రెండు బలమైన పోర్టులు ఉన్నాయని, వీటితో పాటు శ్రీకాకుళంలో కూడా మూడో పోర్టు వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మరో రెండేళ్లలోనే ఇక్కడే అత్యంత సుందరమైన అంతర్జాతీయ పౌర విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుందన్నారు. “నేను కూడా త్వరలోనే విశాఖకు షిప్ట్‌ అవుతాను. అధికారులు మన ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బంది అంతా విశాఖకే వస్తారు. డిసెంబరులోపే విశాఖకు మారుతాం. నేను కూడా విశాఖలోనే నివాసం ఉంటాను. అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటు అయ్యాయని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. 14 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 8 యూనివర్సీలు, 4 మెడికల్‌ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖపట్నం ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారయిందన్నారు. ఏడాదికి దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీలు పూర్తిచేసుకుని వస్తున్నారన్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్‌ లా యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖపట్నంలో ఉన్నాయన్నారు. ఈ విశాఖలోనే దాదాపు 20 వేల నేవల్‌ అధికారుల కుటుంబాలతో కూడిన ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ ఐఓసీ వంటి పబ్లిక్‌ సెక్టార్‌ సంస్ధలు కూడా ఉన్నాయి” సీఎం జగన్ పేర్కొన్నారు.

 

Post Inner vinod found

*సీఎం జగన్ విశాఖలో ప్రారంభించిన సంస్థలు ఇవే….*

 

*ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్*

 

ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో ఒక కొత్త డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్‌ భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. ఇది సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్‌ డిజైన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్‌ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

 

*యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ*

 

ఫార్మా, బయెటెక్‌ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

*లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌*

 

యాక్టివ్‌ ఫార్మాసిటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ యూనిట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.

*లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌*

 

అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో పాటు లారస్‌ ల్యాబ్స్‌ నూతన పరిశ్రమకు కూడా భూమి పూజ చేశారు.

Post midle

Comments are closed.