
*ప్రజల సంక్షమమే జగనన్న లక్ష్యం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
: తిక్కవరంలో గడప గడపకు మన ప్రభుత్వం*
*: ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన నాయకులు*
*రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల సంక్షమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*
*బుధవారం మర్రిపాడు మండలం పల్లవోలు సచివాలయం పరిధిలోని తిక్కవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గజపూలమాలలతో ఘనంగా సత్కరించారు.*

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి అందచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారికి సంక్షేమ లబ్ది కరపత్రాలను అందచేశారు. ముఖ్యమంత్రి అందచేసిన సంక్షేమ పథకాలన్ని అందాయా లేదా… ముఖ్యమంత్రికి ఏం చెప్పామంటారు అంటూ లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.*
*గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్య పరిష్కరించేలా అధికారులు చూడాలని ఆదేశించారు. ఓ దివ్యాంగుడు తనకు పించను నగదు బ్రతుకుదెరువుకు సరిపోవడం లేదని, సహాయం చేయాలని అర్థించడంతో పరిష్కరించేలా చూస్తానని అన్నారు.*

*చుక్కల భూముల సమస్య ఉందని పలువురు గ్రామస్తులు ఆయనకు తెలపడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు నడుం బిగించారని, ఇప్పటికే చుక్కల భూముల సమస్యను పరిష్కరించారని, సాదాబైనామా కోసం జీఓ విడుదల చేశారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి తెలిపారు.*
*హైలెవల్ కెనాల్ ద్వారా తమ గ్రామానికి నీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు పలువురు కోరడంతో పనులు జరుగుతున్నాయని, ఈ విషయమై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలుపుతున్న ప్రతి సమస్యను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు.*
*సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ది పనుల విషయమై ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సచివాలయం పరిధిలో కోట్లాది రూపాయల సంక్షేమ, అభివృద్ది కోసం నిధులు అందచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ మరోమారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.*
Comments are closed.