The South9
The news is by your side.

చిరంజీవి గారి మీద మీ అభిప్రాయం ఏంటి ? మోహన్ బాబుతో బాలయ్య.

post top

సినీ బ్యూరో : బాలకృష్ణతో ఆహా ఓటీటీ సంస్థ టాక్ షో అనగానే ప్రేక్షకులు తో పాటు సినీ ఇండస్ట్రీలోని చాలామందికి ఒక రకమైన ఆసక్తి నెలకొంది. మామూలుగా బాలకృష్ణ మాట్లాడే విధానం సినిమా లో ఒక రకంగా, బయట ఒకరకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది ఆహా ఓటీటీ సంస్థ. బాలయ్యను కొత్తగా చూపిస్తూ ..‌ మొదటి గెస్ట్ గా విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ని తీసుకోవడంతో సహజంగానే అంచానాల ను మించాయి. దానికి తోడు బాలకృష్ణ మోహన్ బాబు ని మీరు చేసిన సినిమాలలో మీరు చూసుకోలేని సినిమా ఏది అని అడగగానే,

after image

మోహన్ బాబు పటాలం పాండు అని చెప్పగానే..‌ వెంటనే బాలయ్య ‌ బాగా రాడ్ రంబోలా లాగ ఉంటుందా… అనడంతో బాలకృష్ణ ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టు రాశారు అని అర్థం అయింది. అలానే చిరంజీవి గారి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగడం , అన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో నుంచి బయటికి ఎందుకు వెళ్లారు అని అడగడం తో షో ఆసక్తిగా ఉంటుందనేది అర్థమయింది. దానికి ప్రతిగా మోహన్ బాబు అన్నగారు స్థాపించిన పార్టీ చేతుల్లో ఉంచుకోకుండా చంద్రబాబు పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నాడని, బాలకృష్ణ ని ప్రశ్నించడం, ఈ ప్రశ్నలన్నీ అల్లు అరవింద్ అడగమన్నాడు అని మోహన్ బాబు అడగడం లాంటి అంశాలు ఈ ప్రోమో లో ఉన్నాయి. మొత్తానికి unstoppable మొదటి షో నే ఆసక్తిగా మలిచారని అర్థమవుతుంది

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.