అమరావతి: ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ది బిజెపి పార్టీ లక్ష్యం. దానికోసమే ప్రజాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో జతకట్టింది బిజెపి పార్టీ. అయితే వారి ఆలోచనలకు భిన్నంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని పార్టీ అంతర్గత చర్చల్లో ప్రధానాంశంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక లో ఏదో మొక్కుబడిగా కలిసినట్లు సాగిన వ్యవహారం తర్వాత కాలంలో కలిసినట్లు పెద్దగా కనిపించలేదు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని విమర్శించడంతో బిజెపి నేతలకు ఇబ్బందికరంగా మారింది ఈ అంశం ఈ అంశం. పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో అని బిజెపి నాయకులుకు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . గతంలో తెలుగుదేశం తో జత కట్టి బిజెపి తో మిత్రపక్షం అని చెప్పుకుంటున్న జనసేన ఏ నిర్ణయం తీసుకున్న పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకుల భావన. అయితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తారా… లేదా అనేది వేచి చూడాల్సిందే!



Comments are closed.