_*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి పంచాయితీ ఎన్నికలు పెడతామంటే ఎందుకు పారిపోతున్నారు ? ఎందుకు భయపడుతున్నారు ?*_
_*బలవంతపు ఎకగ్రీవాలు అన్నీ రద్దు చేయాలి రీ నోటిఫికేషన్ ఇవ్వాలి*_
_*కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి*_
_*రాజ్యంగా వ్యవస్థలను కించపరుస్తూ మాట్లాడుతున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి*_
_*ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఛీఫ్ సెక్రెటరీ ఏ విధంగా ఉత్తరాలు రాస్తారు*_
_*ఎలక్షన్ కమీషన్ కు దుర్భాషలాడుతు ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచడానికి రాజ్యంగ పరిధిని దాటి మాట్లాడారు*_
_*కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగాల సంఘాల నాయకులు ఏ విధంగా మాట్లాడతారు*_
_*రాజ్యంగంలోని 73, 74 అధికణలను ప్రభుత్వం గౌరవించాలి*_
_*ఆర్టికల్ 243కె(3) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్ దే*_
_*వైసీపీ ర్యాలీలకు, ఊరేగింపులకు, పుట్టిన రోజు పండుగలకు, కోతముక్క ఆటలకు కరోనా లేదు*_
_*పుట్టలోనుండి పాములొచ్చినట్టు ఎమ్మెల్యేలు మంత్రులు పోటీలు పడి బూతులు మాట్లాడుతున్నారు*_
_*చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ఎన్నికల కమీషనర్ ను తిట్టేందుకు బూతుల మంత్రి కొడాలి నానికి ఉద్యోగం ఇచ్చారు*_
_*2700కోట్లు రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకుండానే ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని సీఎం జగన్ బడాయి కబుర్లు చెప్పారు మీట నొక్కామని చెప్పారు… కానీ ఇక్కడ రైతులకు డబ్బులు పడలేదు*_
_*మొలకెత్తిన ధాన్యం కొంటామని శాసనసభలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి రైతులను దళారులకు అప్పజెప్పారు*_
_*30, 40 సంవత్సరాల నుండి ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఇంత దరిద్రపు పాదాన్ని దిక్కుమాలిన సంవత్సరం చూడలేదని వ్యవసాయం చేస్తున్న రైతులు చేలల్లో చెప్తున్న మాట*_
_*కరెంటు ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ వాట్ ఛార్జీలు పెంచారు నిత్యవసరాలు పెంచారు చెత్త పన్ను 60/-లు వసూలు చేస్తున్నారు పందులకు కుక్కలకు లైసెన్స్ లు కట్టించుకుంటున్నారు ఆటోలకు 10వేలు ఇచ్చామని చెప్పి ఒక్కోక్క ఆటో వాళ్ళను కదిలిస్తే 10-20వేలు పెనాల్టీలు వసూలు చేసారు*_
_*1953 ఆంధ్రరాష్ట్రం ఎర్పడిన దగ్గర నుండి అన్ని ప్రభుత్వాల అప్పు లెక్కలు తీసుకుంటే ఈ 20 నెలల్లో 2లక్షల కోట్లు అప్పులు చేసి రికార్డు సృష్టించారు*_
_*ముఖ్యమంత్రి, మంత్రుల ఉదాసీనత వైఖరి వల్ల మత విశ్వాసాల మీద భక్తుల మనోభావాల మీద దాడులు చేసారు*_
_*కనకదుర్గమ్మ దేవాలయంలో రధంపై 3 సింహాలు ఇప్పటికీ దొరకలేదంటే మంత్రి వెల్లంపల్లికి సిగ్గుందా ?*&
_*దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు, విధ్వంసాలు, హత్యలు, అవినీతి కుంభకోణాలు వీటన్నింటినీ పక్కదారి పట్టించేందుకే గవర్నమెంట్ స్పాంసర్డ్ కార్యక్రమాలు చేపడుతున్నారు*_
_*గుళ్లు తొలుస్తూ, విగ్రహాలు పడగొడుతూ మరో పక్క దేవాలయాలు కడతామని శంకుస్థాపన చేస్తూ కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నాడు*_
_*వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి వీటన్నింటికి ప్రజలు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుంది*_
_*మీడియా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు*_
Comments are closed.