The South9
The news is by your side.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్ సభలో వైఎస్సార్ సీపీ డిమాండ్

post top

*ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్ సభలో వైఎస్సార్ సీపీ డిమాండ్*

*ఏపీ ప్రజల హక్కును కేంద్రం అమలు చేయాలి*

after image

*ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ర్టానికి హోదా ఇవ్వాలన్న ఎంపీ మిథున్ రెడ్డి*

ఏపీ ప్రజల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా ఇప్పటికైనా ప్రకటించాలని లోక్ సభలో వైఎస్సార్ సీపీ తన డిమాండ్ ను మరోసారి లేవనెత్తింది. విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్రం అండగా నిలిచి, అభివ`ద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్, ఎంపీ మిథున్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కేంద్రాన్ని మరోసారి కోరారు. డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన చర్చలో విభజనతో ఏపీ ఎలా నష్టపోయిందన్న విషయాన్ని మరోసారి వివరించారు. సభలో ఆయన మాట్లాడుతూ, *’వైఎస్సార్ సీపీకి 20 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు ఉన్నారు, మేము ఇదే విషయాన్ని ఎన్నో సార్లు లేవనెత్తాము. వివిధ ఫార్మాట్లలో 100 సార్లు కేంద్రానికి విజ్ణప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మా రాష్ర్టానికి ప్రత్యేక కేటగిరీ హోదాను డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.’* అని పేర్కొన్నారు.
విభజన నష్టాలు కొనసాగడానికి ప్రధాన కారణం *’ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చాలా అన్యాయంగా ఏపీని విభజించారు. రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో, తెలంగాణ తలసరి ఆదాయం రూ. 15,454 కోట్లు కాగా, ఏపీకి ₹8,979 కోట్లు మాత్రమే. మొత్తం జనాభాలో తాము 56% మరియు ఆదాయంలో మాత్రం 45% మాత్రమే వారసత్వంగా పొందాము. అప్పులను మాత్రం 60% వారసత్వంగా పొందాము. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సభలో ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదు* కాబట్టి కేంద్రం మరోసారి ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిశీలించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు జాతీయ స్థాయిలో చర్చించి సాధించడానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ సమస్యలను లేవనెత్తడం ద్వారా సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరోసారి చర్చకు తెచ్చిందని కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.