The South9
The news is by your side.

మత్స్యకారుల తో కలిసి వేటకు వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

post top

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. పుదుచ్చేరి పర్యటనలో రాహుల్ గాంధీ మత్స్యకారుల తో కలిసి పాల్గొన్న సమావేశంలో చెప్పినట్టు, కేరళలోని మత్స్యకారులతో కలిసి తెల్లవారుజామున 4. 30 గంటలకు , చేపల వేటకు వెళ్లారు. దాదాపు గంటసేపు సముద్రంలోనే ఈత కొట్టారు రాహుల్ గాంధీ. అలానే కాంగ్రెస్ మేనిఫెస్టో లో మత్స్యకారుల డిమాండ్లు చేరుస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ‌ ఢిల్లీలో రైతులకు ఒక మంత్రిత్వ శాఖ ఉందని కానీ మీకు లేదని దానికోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు రాహుల్. అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఉత్తర భారతదేశంలోని రాజకీయాలు వేరుగా ఉంటాయని కేరళలో రాజకీయాలు చాలా ఉత్సాహంగా ఉన్నాయని అన్నారు.. ఈ సందర్భంగా అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి ప్రధాని మోదీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు….. అద్భుతం .. నిజం దానంతట అదే బయటపడింది. నరేంద్రమోడీ స్టేడియం. ఆదాని ఎండ్ ‌, రిలయన్స్ ఎండ్ బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా. హమ్ దో హ మార లో…. అంటూ ట్వీట్ చేశారు రాహుల్.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.