తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా జర్నలిస్ట్ మన పాటి చక్రవర్తి ని ఆశీర్వదించండి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్.
తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా జర్నలిస్ట్ మన పాటి చక్రవర్తి ని ఆశీర్వదించండి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్.
తిరుపతి : రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)rpi తెలుగు రెండు రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తిరుపతి ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల కన్వీనర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నంద్యాల ఎలక్షన్ తరహాలో ఇప్పటి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా నేటి వైసీపీ ప్రభుత్వం ఇదే తరహాలో నిర్వహిస్తుంది. నేటి ప్రభుత్వం పుర, పంచాయతీ ఎలక్షన్ లో చేసిన అరాచకాలు ఏకగ్రీవాలు లను ప్రజలు చూస్తున్నారు ప్రజలకు స్వతంత్రంగా ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు .

అటువంటి ఓటు హక్కును ప్రజలను వేయనీయకుండా ఏకగ్రీవల పేరుతో ఈ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమన్నారు తిరుపతి బై ఎలక్షన్ లో టిడిపి వైసిపి బిజెపి పార్టీలు అభ్యర్ధులను నిలబెట్టే అర్హత లేదని ,మండిపడ్డారు ఆధిపత్య పార్టీలు నిలబెట్టే అభ్యర్థులను గెలిపించిన ఉపయోగం లేదన్నారు మా Rpi పార్టీ అభ్యర్థి జర్నలిస్టు మనపాటి చక్రవర్తిని గెలిపిస్తే ప్రజా సమస్యల మీద పార్లమెంటులో గొంతు విప్పి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు YCP ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అందనీయకుండా చేస్తుందన్నారు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న సర్కారు ని తిరుపతి ఎలక్షన్లో ఓటర్ మహాశయులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి జర్నలిస్ట్ మన పాటి చక్రవర్తి ,నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ కె మాబు వెంకటగిరి ఇన్చార్జ్ సుబ్బారావు బి ధనుంజయ ,బాబా కిరణ్ తిరుపతి నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు



Comments are closed.