ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పలుమార్లు ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించారని అందుకే ఆమె అకౌంట్ ని నిలుపుదల చేసినట్లు ట్విట్టర్ ప్రతినిధి తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలో కూడా అభ్యంతరకరమైన ట్వీట్లు చేసినందున శాశ్వతంగా ఆమె అకౌంట్లో తొలగిస్తున్నట్లు ట్విట్టర్ సంస్థ తెలియజేసింది.

ఈ సందర్భంగా కంగనా రనౌత్ ఇంస్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పలువురు నెటిజన్లు బీజేపీ నుంచి ఎంత డబ్బులు తీసుకుని ఏడుస్తున్నావు అని కామెంట్లు పెట్టడం గమనార్హం.



Comments are closed.