The South9
The news is by your side.

ప్రచారమా, లేక ప్రజల్ని చైతన్య పరచడమా…

post top

క్రియేటివిటీకి పెట్టిన పేరు సినిమా వాళ్ళు అని అంటారు. వారి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి రకరకాల మార్గాలను పలురకాల కాన్సెప్ట్ల కోసం అన్వేషణలు చేస్తుంటారు‌. అదేమి తప్పుకాదు వారి వ్యాపారం. సినిమా వాళ్లు ఒక విషయాన్ని చెబితే వారిని అభిమానించే అభిమానులు దానిని ఫాలో అవుతారు. అసలు ఈ ఉపోద్ఘాతం వెనక కథేమిటంటే…… దేశం మొత్తం కరోనాతో అతలాకుతలమౌతున్న వేళ సినీ రంగం చెందిన ఎందరో ప్రముఖులు ఎందుకనో తెరవెనుక ఉండి పోయారు. మొదటి కరోనా సమయంలో మాత్రం సి.సి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో సినీరంగ కార్మికుల్ని ఆదుకున్న సంగతి విదితమే. దానికి అభినందించి తీరవలసిందే ఒక రకంగా అది వారి బాధ్యత. అయితే , ఇప్పుడున్న సెకండ్ వేవ్ లో ఎందుకనో సినీ ప్రముఖులు సహాయం చేయడానికి అంత ఆసక్తి చూపటం లేదనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్,ఆర్. సినిమా బృందం ప్రజలకు అవగాహన కల్పించుటకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సమూహంగా ఉండరాదని సూచిస్తూ… ఆ చిత్ర హీరోలు రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ,హీరోయిన్ అలియా భట్ ,దర్శకుడు రాజమౌళి,తమిళ కన్నడ తెలుగు హిందీ భాషల్లో మాట్లాడిన వీడియో ని సామాజిక మాధ్యమం లో రిలీజ్ చేశారు. అయితే కొందరు నెటిజన్లు ఇది వారి సినిమా ప్రమోషన్ లాగా ఉంది కానీ ప్రజలను చైతన్యపరిచే విధంగా లేదని విమర్శించడం కొసమెరుపు

after image

……….       విశ్వ.   హైదరాబాద్.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.