
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం పై దక్షిణాది సినీ నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా గత కొన్ని రోజుల నుంచి పలు ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు నటుడు సిద్ధార్థ ని టార్గెట్ చేయడం, తమిళనాడు బిజెపి కార్యకర్తలు కొంతమంది సిద్ధార్థ్ ఇంటికి ఫోన్ చేసి చంపుతానని బెదిరింపులు కి పాల్పడడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా రోజు ,రోజుకి బిజెపి నాయకులకి సిద్ధార్థ కి మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా కర్ణాటక బిజెపి ఎంపీ తేజస్వి సూర్య పై సిద్ధార్థ్ ఒక అభ్యంతరకరమైన ట్వీట్ చేశారు. బెంగుళూరులో చాలా హాస్పిటల్స్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తేజస్వి సూర్య వాటిని బ్లాక్ చేస్తున్నారని అనే ఆరోపణల నేపథ్యంలో.. ‘యంగ్ ఎంపీ సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్ద కాలపు ముందు వ్యక్తి ‘ ఈ ట్వీట్ ని సేవ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆంధ్ర రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధార్థ సినిమాలకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నారు అని ట్వీట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా నటుడు సిద్ధార్థ్……లేదు రా. అతను (దావుద్) నా టీడీఎస్ ( టాక్స్ డీ డిడక్ట్ డు సోర్స్) చెల్లించడానికి సిద్ధంగా లేడు. పన్ను చెల్లించే చిత్తశుద్ధి గల పౌరుడిని కదరా విష్ణు. వెళ్ళి పడుకో. బిజెపి రాష్ట్ర కార్యదర్శి అంటా. సిగ్గు ఉండాలి” అని ట్వీట్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి.

No ra. He wasn't ready to pay my TDS. I am a perfect citizen and tax payer kadha ra Vishnu. Velli paduko. BJP State secretary anta. Siggundali. ?? https://t.co/kF67IukEfw
— Siddharth (@Actor_Siddharth) May 6, 2021
Comments are closed.