The South9
The news is by your side.

తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే.. ప్రముఖ నటుడు కమల్ హాసన్

post top

చెన్నై ప్రతినిధి : (కె.సి బాబు)                                                                                                                                                                              ప్రముఖ దక్షిణాది నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తన తుది శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ మక్కల్ నీది మయ్యం ఓడిపోవడం తో పాటు తను కూడా ఓటమిని చవిచూశారు‌. ఈ నేపథ్యంలో పార్టీలోని ముఖ్య నేతలంతా బయటికి వెళ్లడం తో కమల్ రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచార నేపథ్యంలో కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా తన తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు
తన పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లిన తను మాత్రం రాజకీయాల్లోనే కొనసాగుతానని తెలియజేశారు. ఒకప్పటి కాలంలో వ్యాపారాలు ఒక ప్రాంతం లో వ్యాపారం లేక మరొక ప్రాంతానికి వెళ్లి వ్యాపారం చేస్తున్నట్లు , తన పార్టీని వీడిన నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తను మాత్రం రాజకీయాలు వీడనని క్యాడర్ కి ధైర్యాన్ని ఇచ్చారు. అందరం కలిసి ,
మరింత ఉత్సాహంగా, పని చేద్దామని పార్టీని బలోపేతం చేసేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కమల్ హాసన్.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.