
నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు నగరంలో రొండు రోజుల క్రితం ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ నందు కరోనా పేషెంట్ కి సంబంధించిన వైద్యం కొరకు 5 లక్షల 50 వేల రూపాయలు ఫీజు వసూలు చేసి శవాన్ని చేతికి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బాధితురాలు నాల్గో నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగానే , మీడియాలో ప్రచారం జరగడంతో హాస్పిటల్ సిబ్బంది కాళ్లబేరానికి వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బాధిత యువతి ఫిర్యాదు వెనక్కి తీసుకోమని మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇది ‘కిమ్స్’ హాస్పిటల్ లో జరిగిన సంఘటన అయినా, చాలా వరకు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ లో రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కరోనా పేషెంట్లు కి సంబంధించిన వైద్యం విషయంలో, ఆరోగ్యశ్రీ ఉన్న వీరు అంగీకరించరు, కట్టిన డబ్బులు కి బిల్లు ఇవ్వరు, ఆన్లైన్ పేమెంట్ ఉన్న ఒప్పుకోరు సరికదా, చెల్లించవలసిన మొత్తం ఏదైతే ఉందో చేతికి మాత్రమే తీసుకుంటారు. ఈ తంతు అంతా ప్రతి హాస్పిటల్ లో జరిగేది ఇదేమి ఏమి సీక్రెట్ గా జరుగుతున్న వ్యవహారం అయితే కాదు. బహిరంగ రహస్యమే. ఆరోగ్యశ్రీ అధికారులకి, కోఆర్డినేటర్స్ కి తెలియకుండా జరుగుతుంది అనుకుంటే మాత్రం హాస్యాస్పదం. ఇంకయినా జిల్లా కలెక్టర్ గారు, అధికారులు వీటిపై దృష్టిపెట్టి పేద ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం.
Comments are closed.