ఆనందయ్యతో కాకాణి ప్రెస్ మీట్
తేది:23-05-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , పాల్గొన్న బొణిగి ఆనందయ్య యాదవ్.
పోలీసులు తనను అరెస్టు చేసినట్లుగా, తన అనుచరులను నిర్బంధించినట్లుగా వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని, తనను ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని, తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నానని కొన్ని మీడియాలలో వస్తున్న వదంతులకు తెరదించిన బొణిగి ఆనందయ్య యాదవ్
కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
? ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుకు విశేషమైన ఆదరణ లభించడంతో ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు దృష్టిపెట్టారు.
? ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు యొక్క శాస్త్రీయతను అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయుష్ బృందాన్ని మరియు ఐ.సీ.యం.ఆర్. బృందాన్ని హుటాహుటిన నెల్లూరుకి పంపించడం జరిగింది.
? ఆయుష్ బృందం మరియు ఐసీఎంఆర్ కమిటీ సభ్యులు అధ్యయనం పూర్తి చేసి, నివేదికలు అందించిన వెంటనే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది.

? నిపుణుల బృందం అధ్యయనం పూర్తి చేసిన తర్వాత మందు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పితే, మందు పంపిణీకి అడ్డంకులు తొలిగినట్లే!
? ప్రభుత్వం నుండి అనుమతి లభించిన తర్వాత విధివిధానాలు రూపొందించి, కోవిడ్ నిబంధనలు అనుసరించి, మందు పంపిణీని చేపట్టడం జరుగుతుంది.
? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే ఆయుష్ బృందం, ఐసీఎంఆర్ బృందాలు నెల్లూరులో పర్యటించి, మందు తయారీ విధానాన్ని పరిశీలించడంతో అధ్యయనం ప్రక్రియ వేగవంతమైంది.
? ఆనందయ్య తయారుచేసిన మందును ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లావ్యాప్తిగా అవసరమైన వారందరికీ పంపిణీ చేసే బాధ్యత నాది.

? ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి మందు కోసం రావడంతో కరోనా ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున దయచేసి ఎవ్వరూ సుదీర్ఘ ప్రాంతాల నుండి రావద్దని మనవి.
? నిపుణుల బృందం మందు తయారీలో ఎటువంటి ఇబ్బందుల్లేవని తేల్చిన తర్వాత ప్రభుత్వ అనుమతితో సుదీర్ఘ ప్రాంతాలకు కూడా కొరియర్ ద్వారా గానీ లేదా, ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా గానీ మందు అందించే ప్రయత్నం చేస్తాం.
? ప్రభుత్వం అనుమతించిన వెంటనే విధివిధానాలు రూపొందించి, కోవిడ్ మందు పంపిణీ చేపట్టడం జరుగుతుంది గనుక అప్పటి వరకు ఎవ్వరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించవలసినదిగా మనవి.
? ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేశారని, ఆనందయ్యను రహస్య ప్రాంతాలకు తరలించారని, మీడియాలలో వస్తున్న అపోహలకు ఆనందయ్య వ్యాఖ్యలే సమాధానం.
? కరోనా సంక్షోభ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. అని కాకాణి అన్నారు
బొణిగి ఆనందయ్య యాదవ్ మాట్లాడుతూ
? నన్ను ఎవ్వరూ నిర్బంధించలేదు.
?నేను స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా తిరుగుతున్నా.
? నేను అందిస్తున్న వైద్యం పట్ల ఆసక్తి కనబరిచి అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని పంపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు.
? ఆయుర్వేద మందు తయారు చేయడంలో, ప్రజలకు అందించడంలో నాకు అండగా నిలిచి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మా సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు.
? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యునిగా గోవర్ధన్ రెడ్డి ఉన్నంత కాలం ఎవ్వరూ నన్ను ఇబ్బందులపాలు చేయ్యలేరు.
? నిపుణుల బృందం నివేదిక అందించి, ప్రభుత్వం అనుమతించిన వెంటనే, మందు తయారు చేసి, పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అని అన్నారు



Comments are closed.