The South9
The news is by your side.

నెల్లూరు ప్రముఖ హాస్పిటల్ కిమ్స్ లో నయా మోసం

post top

నెల్లూరు ప్రతినిధి :(క్రైమ్)  దేశంలో కరోనా విజృంభణ కి, ప్రముఖుల నుంచి సామాన్యులు దాక అందరూ కరోనా కాటుకు గురైన వారే. ఈ నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి చాలా దారుణమని చెప్పుకోవాలి.                 గవర్నమెంట్ దవాఖానా లో బెడ్స్ దొరకక. దొరికిన ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సామాన్యులు అప్పోసొప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళితే వాళ్లు నిలువునా దోచుకుంటున్నారు. దోచుకున్న ప్రాణం నిలుస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి వర్తించక పోయినా ,చాలా వరకు పరిస్థితి ఐతే ఇలానే ఉంది.                                                           ఈ నేపథ్యంలో నెల్లూరు కి చెందిన ప్రముఖ హాస్పిటల్ “కిమ్స్” నందు ఏప్రిల్ 30 న కొమ్మి నల్ల పయ్య నాయుడు కరోనా చికిత్స కొరకు హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆర్థిక కారణాల వలన, ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకు వెళతానని నలపయ్య నాయుడు కోడలు ఉమా మహేశ్వరి “కిమ్స్ ” హాస్పిటల్ వారితో తెలపగా.. 5 లక్షల 50 వేల రూపాయలు బిల్లు అయ్యిందని ఆ డబ్బులు చెల్లించి తీసుకు వెళ్ళ వచ్చని తెలిపారని ఆమె అన్నారు. తీరా డబ్బులు చెల్లించిన తర్వాత శవాన్ని చేతికి ఇచ్చారని తెలిపారు. పేషెంట్ తాలూకా అటెండర్ కి తెలియకుండానే మూడు రోజుల పాటు ఐసీయూ కి తరలించడం చనిపోయిన విషయాన్ని దాచి డబ్బులు గుంజాడం అన్యాయమని ఉమా మహేశ్వరి హాస్పిటల్ దగ్గర నిరసన తెలిపారు. ఆమెకు బిజెపి నాయకులు మిడతల రమేష్ , బెల్లంకొండ రామకృష్ణా , చిలకా ప్రవీణ్ సంఘీభావం తెలిపారు. తరువాత నాలుగో నగర పోలీస్ స్టేషన్ కి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ‌ ఈ విషయంపై నాల్గవ నగర సీఐ నాగేశ్వరమ్మ ని సంప్రదించగా ఫిర్యాదు అందిందని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తిగా విచారించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకపక్క కరోనా సోకిన మనిషి ప్రాణం నిలుపుకోవడానికి అల్లాడుతుంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ దీనిని వ్యాపారంగా మలుచుకోవాలని అనుకోవడం చాలా దారుణం.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.