
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందుగల ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ని ద సౌత్ 9 వినోద్ ఫౌండేషన్ ల ఫౌండర్ మనపాటి చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా పలు విషయాలపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ లో చాలామంది కి ఆనందయ్య ముందు సంజీవి ల పని చేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆనందయ్య చేసిన సేవలకుగాను ఆయనని అభినందించారు. తదనంతరం మీడియా సమావేశంలో మన పాటి చక్రవర్తి మాట్లాడుతూ…. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గురించి ప్రపంచమంతా ఆనందయ్య ముందు కోసం చూసేలా చేశారని ఆయన అన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కృష్ణపట్నం ఉన్నందున ఆనందయ్య తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అని తెలిపారు. అలానే తన పౌండేషన్ వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందయ్య ముందు పంపిణీ జరుగుతుందని ,.

దానికి సంబంధించి కూడా చర్చించడానికి వచ్చానని తెలిపారు. తదుపరి ఆనందయ్య మాట్లాడుతూ … మా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు మరియు’ సౌత్ 9 మీడియా , వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మన పాటి చక్రవర్తి ని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. త్వరలో వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మందు పంపిణీ కార్యక్రమం చేస్తామని తెలిపారు. సందర్భంగా ఆనందయ్య ని మనపాటి చక్రవర్తి సన్మానించడం జరిగింది. ప్రతిగా ఆనందయ్య చక్రవర్తిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలోద సౌత్ 9 నెల్లూరు హెడ్ అనిల్, ఫోటోగ్రాఫర్ జగదీష్, హైదరాబాద్ ఇన్చార్జ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



Comments are closed.