The South9
The news is by your side.

నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి శిల్పా శెట్టి!

post top

ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా నీలి చిత్రాల వ్యవహారంలో గత నెల 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విచారణలో భాగంగా శిల్పాశెట్టి ని కూడా ముంబై పోలీసులు విచారించడం, వాటిపై మీడియాలో రావడం తో, శిల్పా శెట్టి ముంబై హైకోర్టు లో మీడియా సంస్థల పై పరువునష్టం దావా వేయగా ఆ పిటిషన్ ని హైకోర్టు తోసిపుచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని, విచారణలో పోలీసులతో మీరు సంభాషించిన విషయాలే ప్రచురించడం జరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించడంతో శిల్పా శెట్టి కంగుతిన్నారు. ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారంతో తన మనసు కలత చెందింది అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

after image

శిల్ప మాట్లాడుతూ..గత కొన్నిరోజలుగా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వ్యవహరంపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలని భావించ‌డం లేదు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక త‌ల్లిగా నా పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని నేను ఓ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి…. అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.