
నెల్లూరు ప్రతినిధి :
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఘాటుగా స్పందించారు. నియోజకవర్గం పరిధిలో జరిగిన మైనింగ్ వ్యవహారంలో సోమి రెడ్డి చేసిన ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు దీనికి సంబంధించి ఈరోజు నెల్లూరు నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు…….. కాకాణి మాట్లాడుతూ……
సిట్టింగ్ జడ్జితో విచారణకైనా, హైకోర్టులో పిల్ కు అయినా నేను సిద్ధం!, దమ్ము, ధైర్యం ఉంటే నా సవాలు స్వీకరించు.
నీతి, నిజాయితీ ఉంటే విచారణకు రా….
2014 నుండి 2021 వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు ఎంత అవినీతి జరిగిందో, విచారణ జరిపిద్దాం.
నా హయాంలో అవినీతి జరిగినట్లు తేలినా, నీ హయాంలో అవినీతి జరగలేదని నిరూపణ అయినా, నేను రాజీనామా చేసే దానికి సిద్ధం,
సోమిరెడ్డి వాలకం చూస్తుంటే, “పిచ్చికుక్క” కరిసి పిచ్చెక్కి, పిచ్చాసుపత్రి నుండి జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్లు”నిర్వహిస్తున్నట్లు అనిపిస్తుంది.
సోమిరెడ్డి గతంలో అనేక ఆరోపణలు చేసి, నవ్వుల పాలు అవుతున్న, సిగ్గూ, ఎగ్గూ లేకుండా, ఎవరైనా నోట్లో ఊస్తారేమో అనే ఇంగిత జ్ఞానం లేకుండా , ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు.

సోమిరెడ్డి గతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా మాఫియా గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపించాడు.
గ్రావెల్ తరలించిన వారి పై పోలీస్ కేసు నమోదు చేయకుండా ఎమ్మెల్యే చెప్పినట్లుగా” అధికారులు, పోలీసులు పని చేస్తున్నారని విమర్శించాడు.
ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తే యం.శ్రీనివాసులురెడ్డి పేరు మాగుంటశ్రీనివాసులు రెడ్డి అంటూ ప్రచారం చేస్తున్నాడు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై నేను కేసు నమోదు చేయించానని మాట్లాడుతున్న సోమిరెడ్డిని ఏమనాలో జిల్లాకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు నిర్ణయించాలి”.
నేను శ్రీనివాసులు రెడ్డి పేరిట, నా అనుచరుల చేత గ్రావెల్ తోలించి, నేనే మరలా నా అనుచరుల పైన కేసు పెట్టినట్లు మాట్లాడే సోమిరెడ్డి..పిచ్చి వెధవ కాకపోతే ఇంకేమిటి?.
సోమిరెడ్డి సాధారణంగా “నోరు తెరిస్తే పక్కన ఉన్న వారు భరించలేక, *”అంటువ్యాధుల బారిన పడిన సందర్భాలు కోకొల్లలు”
సోమిరెడ్డి *”నోటి కంపు”* రోజురోజుకి ఎక్కువవడంతో ఎక్కడ *”గాలి పీల్చి, ఎక్కడ రోగాలబారిన పడుతామేమోనని!” నాయకులు, కార్యకర్తలు సోమిరెడ్డి దగ్గరకు పోవడం మానేశారు.
*”సోమిరెడ్డి లాంటి ఉడతలు పట్టే వెధవ”* ని నేను విమర్శిస్తే, కొంతమంది జిల్లాలోని ప్రముఖ నాయకులను పోల్చి మాట్లాడటం నాకు బాధ కలిగించింది.
*”తల మాసిన వెధవ సోమిరెడ్డి”* తాను బజారున పడి గబ్బు పడటం కాకుండా, గుట్టుగా ఉన్న కుటుంబాలను కూడా *”వీధిలో పెట్టే ప్రయత్నం”* చేస్తున్నాడు.
నా వారిచేత దొంగ దరఖాస్తులు పెట్టించి, వారి ద్వారానే గ్రావెల్ తరలించి, నా మాటే వింటారు అంటున్న పోలీస్ అధికారుల చేత, నా వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టించానని సోమిరెడ్డి చెప్పడం చూస్తుంటే, *సోమిరెడ్డి నీతి నిజాయితీ కలిగిన వాడా! అడ్డాల వెధవా!” అనేది అర్థమవుతుంది.
ఆనందయ్య మందు విషయంలో నాపై ఆరోపణలు చేసి, పోలీస్ కేసు పెడతానని, శేశ్రితా టెక్నాలజీ సంస్థ సోమిరెడ్డి పై కేసు పెడితే, *”పారిపోయి”*, తనపై నమోదైన కేసును కొట్టి వేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు.
అందుకే అనేక సందర్భాలలో *”నీతి, జాతి లేని సోమిరెడ్డి”* అడ్డాల వాడిగా సంభోధిస్తే కొంతమందికి కోపం వస్తుంది.
సోమిరెడ్డి తాను సంస్కారవంతుడునని చెప్పుకుంటూ, మాపై నిందలు వేస్తూ, మమ్మల్ని విమర్శించమని, దూషించమని తెలుగుదేశం నాయకుల చంక నాకుతున్నాడు
సోమిరెడ్డి కడుపుకి అన్నం తింటున్నాడో, ఇంకేమైన తింటున్నాడో తెలియదు కానీ కడుపుకి అన్నం తినేవాడు వ్యవహరించే విధంగా వ్యవహరించడం లేదు.
నిత్యం అవినీతిలో మునిగి తేలే సోమిరెడ్డి మమ్మల్ని విమర్శించడం *”సోమిరెడ్డి వల్ల కాదు కదా!, సోమిరెడ్డి తాత, ముత్తాతల తరం కూడా కాదు” అంటూ తనదైన శైలిలో స్పందించారు.



Comments are closed.