
మా అధ్యక్ష ఎన్నికల బరిలో ఓటమి చెందిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ తో వార్తల్లో నిలిచారు. మెగా కాంపౌండ్ సపోర్టుతో బరిలో దిగిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పై ఓటమిపాలైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ చిత్రంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అర్థంతో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. మా ఎన్నికలలో బహిరంగంగా నాగబాబు ప్రకాష్రాజ్ మద్దతు తెలపగా, నిన్న ప్రభుత్వం పై నాగబాబు చేసిన కామెంట్స్ పై మద్దతు పలికిన విధంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ మాటల్లో…

సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’ అని ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలోవిమర్శించారు.



Comments are closed.