The South9
The news is by your side.

మరో “దావత్ ” తో అలరించబోతున్న భాను మాస్టర్.

post top

జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో బలగం జగదీష్ నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రం ది కానిస్టేబుల్.

ఈ చిత్రానికి సంబంధించిన ఐటమ్ సాంగ్ హైదరాబాదులోని నగర శివారులో గల ఒక రిసార్ట్ నందు భారీ సెట్టింగ్ తో, పాట చిత్రీకరణ ప్రారంభమైంది. ఎన్నో సూపర్ హిట్ పాటలకి, అద్భుతమైన స్టెప్పుల్ని కంపోజ్ చేసిన భాను మాస్టర్ ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.

60 మంది డాన్సర్లతో దాదాపు 40 లక్షల రూపాయల భారీ సెట్టింగ్ తో అద్భుతమైన రీతిలో నిన్నే పాట చిత్రీకరణ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో డాన్స్ మాస్టర్ భాను మాట్లాడుతూ….. “దావత్ “అనే ఈ గీతం మంచి మాస్ మసాలా పాటుగా ఇరు రాష్ట్రాలలోని ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు మాస్ ప్రేక్షకులు కు ఇది నిజమైన “దావత్’ అని తెలిపారు.

after image

మరో రెండు రోజులు షూటింగ్ పార్ట్ తో పాట చిత్రీకరణ పూర్తవుతుందని డ్యాన్స్ మాస్టర్ భాను తెలిపారు.

 

ఈ చిత్రానికి కెమెరా : హజరత్ షేక్ (వలి), సంగీతం : సుభాష్ ఆనంద్, మాటలు : శ్రీనివాస్ తేజ, పాటలు : రామారావు, శ్రీనివాస్ తేజ.

Post midle

డువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆర్యన్ సుభాన్ SK, నిర్మాత : బలగం జగదీష్,

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.