south9 :
కృష్ణా జిల్లా అవనిగడ్డలో శుక్రవారం ఉదయం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పులిగడ్డ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, డ్రైవర్‌పై దాడి చేయడం కలకలం రేపింది.

స్థానికుల వివరాల ప్రకారం, అవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సు కోసం ప్రయాణికులు అరగంటకు పైగా వేచి ఉన్నారు. బస్సు వచ్చేసరికి ఆపేందుకు మహిళ ప్రయత్నించినా, డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ బస్సును వెంబడించి ఎక్కి డ్రైవర్‌ను చెప్పుతో కొట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు, అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రయాణికుల సౌకర్యాల పట్ల ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణమా? లేక మహిళ ఆగ్రహం హద్దులు దాటిందా? అన్న దానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.


